వైరల్‌: నిక్‌, ప్రియాంక పార్టీ వీడియో

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, భర్త నిక్‌ జోనస్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. న్యూ ఇయర్‌ పార్టీలో భాగంగా వీరిద్దరూ ప్రేమగా హత్తుకుని, ముద్దాడిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. న్యూయర్‌ సందర్భంగా నిక్‌ జోనస్‌ తన సోదరుడితో కలిసి ఫ్లోరిడాలో లైవ్‌ మ్యూజిక్‌ షో ఇచ్చాడు. ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా, తహీరా కశ్యప్‌, ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్‌ చోప్రా కూడా పార్టీలో ఉన్నారు. వేడుకల్లో భర్త నిక్‌ జోనస్‌ను ఎంకరేజ్‌ చేస్తూ ప్రియాంక పార్టీలో ఉత్సాహాన్ని నింపారు. 




కాగా నిక్‌  జోనస్‌ లైవ్‌ మ్యూజిక్‌ మధ్యలో స్టేజ్‌ కిందకు వచ్చి ప్రియాంకను స్టేజ్‌ మీదకు తీసుకెళ్లి హత్తుకుని ప్రేమతో ముద్దాడుతూ న్యూ ఇయర్‌కు వెల్‌ కమ్‌ చెప్పారు. ఈ న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో నిక్‌, ప్రియాంకల ప్రపంచాన్ని మరిచిపోయి.. ప్రేమలో తేలిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక గత ఏడాది ప్రియాంక నటించిన  'స్కై ఈజ్‌ పింక్‌' మూవీ ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ప్రియాంక రాజ్‌ కుమార్‌ రావుతో కలిసి 'ది వైట్‌ టైగర్‌' మూవీలో నటిస్తున్నారు.